chiranjeevi: ఆ సినిమా చేయనన్నాను.. చిరంజీవి ప్రోత్సహించడంతోనే చేశాను!: యండమూరి వీరేంద్రనాథ్
- నేను దర్శకత్వం చేసిన 'అగ్ని ప్రవేశం' ప్లాప్'
- 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' చేయనని చెప్పాను
- చిరూ .. అల్లు అరవింద్ చేయమని ప్రోత్సహించారు
నవలా సాహిత్యంలో యండమూరి వీరేంద్రనాథ్ తనదైన ముద్రవేశారు. ఆయన రాసిన నవలలు కొన్ని సినిమాలుగా శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అలాంటి యండమూరి వీరేంద్రనాథ్ మెగాఫోన్ కూడా పట్టారు. అలా ఆయన తెరకెక్కించిన సినిమాలలో 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' ఒకటి. ఈ సినిమా చాలా సాధారణమైన మాస్ మసాలా మూవీలా ..అతుకుల బొంతలా అనిపించిందనే విమర్శ 'తెలుగు పాప్యులర్ టీవీ' ఇంటర్వ్యూలో యండమూరి వీరేంద్రనాథ్ కి ఎదురైంది.
అందుకాయన స్పందిస్తూ .. "ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ .. విజయశాంతి .. నిరోషా .. ఆరుపాటలు. ఇది నాకు ఎంతమాత్రం నచ్చని ఫ్రేమ్. ఇది నీకు తెలియదా తీసేటప్పుడు అని మీరు అడగొచ్చు. తీసేముందు తెలియలేదు .. తీసేటప్పుడు తెలిసింది. అంతకుముందు నేను డైరెక్ట్ చేసిన 'అగ్నిప్రవేశం' ఫెయిలైంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. కె.ఎస్. రామారావు వద్దన్నారు .. నేను కూడా వదిలేద్దామనే చెప్పాను. "లేదు .. లేదు .. నువ్ చేయవలసిందే"నంటూ చిరంజీవి సపోర్ట్ చేశారు. ఫస్టు డే షూటింగ్ అయిపోయిన తరువాత కూడా నేను చేయనని చెప్పాను. అప్పుడు అల్లు అరవింద్ గారు కూడా "మీరు బాగా చేయగలరు .. చేయండి" అన్నారు. "అది నా జోనర్ కాదంతే .. "అంటూ చెప్పుకొచ్చారు.