galla jayadev: పవన్ కల్యాణ్, మహేష్ బాబు రాజకీయాలపై గల్లా జయదేవ్ స్పందన!

  • పవన్ పొలిటికల్ స్టాండ్ అర్థం కావడం లేదు
  • మహేష్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు
  • పరస్పర సహకారంపైనే బీజేపీతో పొత్తు ఆధారపడి ఉంటుంది

ప్రజారాజ్యంలో పవన్ కల్యాణ్ పని చేసినప్పటి నుంచి ఆయనను తాను గమనిస్తూనే ఉన్నానని... ఆయన ఆలోచనా విధానం మంచిదని సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన పరితపిస్తుంటారని చెప్పారు. అయితే, ఆయన పొలిటికల్ స్టాండ్ ఏంటనేది మాత్రం తనకు అర్థం కావడం లేదని తెలిపారు.

ఇప్పటికీ పవన్ ను టీడీపీ మిత్రుడిగానే భావిస్తోందని... రానున్న రోజుల్లో కూడా ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. మహేష్ బాబుకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం అందించే సహకారాన్ని బట్టే బీజేపీతో టీడీపీ పొత్తు ఆధారపడి ఉంటుందని జయదేవ్ స్పష్టం చేశారు. రాజకీయ సంబంధాలు కేవలం పరస్పర సహకారంపైనే కొనసాగుతాయని అన్నారు. 

galla jayadev
Pawan Kalyan
Mahesh Babu
Telugudesam mp
tollywood
janasena
  • Loading...

More Telugu News