Virat Kohli: కోహ్లీ, అనుష్కల పెళ్లికి ఆ ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే ఆహ్వానం?

  • సచిన్, యువరాజ్ లకు ఆహ్వానం
  • షారుఖ్, అమీర్ ఖాన్ లను ఆహ్వానించిన అనుష్క
  • నెలాఖరులో ముంబైలో గ్రాండ్ రిసెప్షన్

ఈ నెల 12వ తేదీన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మల పెళ్లి ఇటలీలో జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. తన వివాహానికి కేవలం ఇద్దరు క్రికెట్ దిగ్గజాలను మాత్రమే కోహ్లీ ఆహ్వానించాడట. వీరు మరెవరో కాదు, ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్. వీరితో పాటు తన బాల్య మిత్రులు కొందరిని మాత్రమే కోహ్లీ ఆహ్వానించాడట. ఈ విషయాన్ని కోహ్లీ సన్నిహితుడు మెన్స్ ఎక్స్ పీకి తెలిపాడు.

ఈ వివాహానికి మూడు నెలల క్రితమే ప్లాన్ చేశారని... అయితే కావాలనే కోహ్లీ, అనుష్కల కుటుంబాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని చెప్పాడు. తన వైపు నుంచి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, మనీష్ శర్మ, ఆదిత్య చోప్రాలను అనుష్క ఆహ్వానించిందట. పెళ్లి అనంతరం ఈ నెలాఖరులో ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ వేడుకకు టీమిండియా జట్టుతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతారు.

Virat Kohli
Anushka Sharma
kohli anushka sharma marriage
Sachin Tendulkar
Yuvraj Singh
  • Loading...

More Telugu News