yamuna: ఓ సారి చిరూ ఇంటికి వెళ్లాను .. అప్పుడే పవన్ కలిశారు!: యమున

  • ఆ మూవీలో పవన్ నటన ఇష్టం 
  • ఆయన హీరో కావడానికి ముందే కలిశాను 
  • ఎంతో బాగా మాట్లాడతారు    

తెలుగులో విభిన్నమైన పాత్రలను చేసి మెప్పించిన యమున, తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "ఇప్పుడున్న హీరోల్లో ఎవరి నటన మీకు ఎక్కువగా నచ్చుతుంది?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అప్పుడామె స్పందిస్తూ .. " ఒకరని చెప్పలేను .. ఒక్కో సినిమాలో ఒక్కో హీరో నటన నచ్చుతుంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో క్లైమాక్స్ లో పవన్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది" అన్నారు.

"పవన్ ని ఒకసారి కలిశాను .. అప్పటికి ఆయన ఇంకా హీరో కాలేదు. ఓసారి న్యూ ఇయర్ సందర్భంగా స్వీట్స్ తీసుకుని చిరంజీవిగారి ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన టెంపుల్ కి వెళ్లారు .. అప్పుడే అక్కడ పవన్ ను చూశాను. "అన్నయ్య వాళ్లు కాసేపట్లో వచ్చేస్తారు కూర్చోండి" అంటూ ఆయన మర్యాద పూర్వకంగా ఆహ్వానించి .. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన సంఘటన అలా గుర్తుండిపోయింది. ఆ తరువాత చిరంజీవి గారు రాగానే స్వీట్స్ ఇచ్చి విషెష్ చెప్పేసి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.    

yamuna
pavan
  • Loading...

More Telugu News