nani: ఆకట్టుకుంటోన్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి' న్యూ పోస్టర్స్

- 'మిడిల్ క్లాస్ అబ్బాయి'గా నాని
- వదిన పాత్రలో భూమిక
- ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణ
- ఈ నెల 15వ తేదీన విడుదల
నాని అభిమానులంతా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైను పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె ఆర్టీఏ అధికారిగా .. నానికి వదిన పాత్రలో కనిపించనుంది. ఇక నాని మాత్రం పనీ పాటా లేకుండా గాలికి తిరుగుతూ ఉంటాడట. దాంతో ఈ ఇద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదట.
