mahesh kathi: వారు ఆల్రెడీ 'మావోడు వస్తున్నాడు' అని డప్పు కొట్టేశారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మ‌హేశ్ క‌త్తి తీవ్ర విమ‌ర్శ‌లు

  • చిరంజీవి సామాజిక న్యాయం అంటే నమ్మాము
  • మోసం చేసి పోయాడు
  • ఇప్పుడు నువ్వొచ్చావ్.. కాపులు నువ్వొచ్చావ‌ని చెప్పుకుంటున్నారు

త‌నకు కులాలు, మ‌తాలు ముఖ్యం కాద‌ని, మాన‌వ‌త్వ‌మే ముఖ్య‌మ‌ని జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకుంటోన్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్య‌ల్లోని త‌ప్పుల్ని వెతికిప‌డుతూ సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ కత్తి మీడియా ముందుకు వ‌స్తున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలోనూ ప‌వ‌న్ తీరుని వివ‌రించి చెబుతూ విమ‌ర్శిస్తున్నారు.

 "కాపు సామాజిక వర్గం మీ అన్నయ్య చేసిన అన్యాయానికి నీ నుంచీ ప్రతిఫలం ఆశిస్తోంది. ఆల్రెడీ 'మావోడు వస్తున్నాడు' అని డప్పు కొట్టేశారు. నేను విశ్వమానవుడ్ని. నాకు కులం లేదు...లాంటి ఉబుసుపోని కబుర్లు చెప్పకు. కాపు రిజర్వేషన్ల పట్ల నీ వైఖరి నీ సహజ ప్రవృత్తిని తెలియజెప్పేసింది.

చిరంజీవి సామాజిక న్యాయం అంటే నమ్మాము. మోసం చేసి పోయాడు. రాజకీయంగా కాపులను, బహుజనులు, దళితులను, మైనారిటీలను ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్. నాకు కులం లేదు అంటున్నావ్. ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నదే కులం. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం, అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో...రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాడు. గ్రవుండ్ రియాలిటీ గ్రహించి మాట్లాడు.

తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన ప్ర‌త్యేక ఫ్లైట్‌ లో వచ్చిన ఈ విశ్వ మానవుడు, మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదు?"  అని మ‌హేశ్ క‌త్తి విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.    

  • Loading...

More Telugu News