Pakistan: పాకిస్థాన్ అంటేనే చీద‌రించుకుంటోన్న 72 శాతం మంది భార‌తీయులు... స‌ర్వేలో వెల్ల‌డి

  • వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ స‌ర్వే
  • 2013లో 54 శాతం మందిలో పాక్ అంటే వ్య‌తిరేక‌త‌
  • 2014లో 49 శాతం మందిలో
  • ఇప్పుడు భారీగా పెరిగిన పాక్ వ్య‌తిరేక‌త

పాకిస్థాన్‌పై భార‌తీయుల తీరు ఎలా ఉంది? అనే అంశంపై వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ స‌ర్వే చేసింది. భార‌త్‌లోని 72 శాతం మందికి పాకిస్థాన్‌పై సదభిప్రాయం లేదని ఆ సర్వేలో తేలింది. 2464 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని నివేదిక విడుద‌ల చేస్తున్న‌ట్లు పేర్కొంది. 2013లో 54 శాతం మంది, 2014లో 49 శాతం మంది భార‌తీయుల‌కు పాకిస్థాన్ పట్ల వ్యతిరేకత ఉండేది. కానీ, ఇప్పుడు 72 శాతానికి చేరింది.

పాక్‌పై వ్య‌తిరేక‌త ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల్లో అధికంగా ఉంది. అలాగే పార్టీ ప‌రంగా చూస్తే బీజేపీని అభిమానిస్తోన్న వారిలో 70 శాతం మంది, కాంగ్రెస్‌ను అనుస‌రిస్తోన్న వారిలో 63 శాతం మందికి ఆ దేశం అంటే వ్యతిరేకత ఉంది. కాగా, దేశంలోని 88 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నార‌ని ఇదే స‌ర్వే ద్వారా తెలిసింది. పాక్‌తో ఆయ‌న అనుస‌రిస్తోన్న వైఖ‌రికి మాత్రం 21 శాతం మంది మాత్రమే మ‌ద్ద‌తు తెలిపారు.

  • Loading...

More Telugu News