koppal: కొప్పల్ మఠంలో కలకలం.. మహిళతో ఏకాంతంగా స్వామీజీ... వైరల్ అవుతున్న వీడియో!

  • గదిలో పీఠాధిపతికి సమీపంలో ఏక వస్త్రంతో మహిళ
  • అసభ్యకరంగా కనిపిస్తున్న వీడియో
  • బయటపెట్టిన మాజీ డ్రైవర్

కర్ణాటక రాష్ట్రంలోని మరో మఠంలో స్వామి వారి రాసలీలలు బయటకువచ్చాయి. కొప్పల్ లోని కలమత మఠం పీఠాధిపతి కొట్టురేశ్వర ఓ మహిళతో ఏకాంతంగా, సన్నిహితంగా గడిపిన దృశ్యాల వీడియో బయటకు రావడంతో అదొక పెద్ద వైరల్ గా మారిపోయింది. దీంతో నిరసనలు మొదలయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో మఠం వద్దకు చేరుకుని ప్రధాన గురువు, పీఠాధిపతి అయిన 56 ఏళ్ల కొట్టురేశ్వరను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇవన్నీ నిజం కాదని, కావాలనే స్వామిని అప్రదిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నంగా ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు.

కలమత మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది లింగాయత్ లకు చెందిన మఠం. 1995లో కొట్టురేశ్వర పీఠాధిపతి అయ్యారు. వీడియోలో కనిపిస్తున్న మహిళను స్వామీజీకి వంట చేసి పెట్టడానికి 2010లో తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. స్వామీజీతో ఆమె ఏకాంతంగా గడిపిన సందర్భాన్ని వీడియో తీసి మాజీ డ్రైవర్ మల్లయ్య హెరూర్ బయటపెట్టాడు. దీని తర్వాత, తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని అతడు గంగావతి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. మఠాధిపతి లైంగిక వేధింపులపై తమకు ఫిర్యాదు అందలేదని కొప్పల్ టౌన్ సబ్ ఇన్ స్పెక్టర్ ఉదయ్ రవి తెలిపారు.

koppal
matt
karnataka
swami
women
sexually
  • Loading...

More Telugu News