pakistan: అమెరికా అయినా వదిలిపెట్టేది లేదు... పాకిస్థాన్ గగనతలంలో డ్రోన్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు!

  • డ్రోన్లను కూల్చేయాలంటూ పాక్ వాయుసేనాధిపతి ఆదేశాలు
  • తమ గగనతలంలో ఉల్లంఘనల్ని అనుమతించబోమని స్పష్టం
  • ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం

దేశ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లను కాల్పులు జరిపి వాటిని కూల్చివేయాలని పాకిస్థాన్ వాయుసేనాధిపతి సోహాలీ అమన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా అమెరికా డ్రోన్లను దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో అమెరికా నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

2004 నుంచి అమెరికా ఈ పనిచేస్తుండగా... పాక్ మాత్రం తాజాగా కూల్చివేత నిర్ణయాన్ని తీసుకోవడం ఆశ్చర్యకరం. ‘‘మా గగనతంలోకి ఎవరైనా సరే చొరబడేందుకు అనుమతించం. డ్రోన్లను నేల కూల్చేయాలని దళాలకు ఆదేశాలు జారీ చేశాం. మా గగనతంలోకి అమెరికా డ్రోన్లు ప్రవేశించినా కూల్చేస్తాం’’ అని సోహాలీ అమన్ తెలిపారు.

  • Loading...

More Telugu News