ayodhya: సుప్రీంకోర్టు కాదంటే బీజేపీ నేతలే ఆ పని చేస్తారు! రామమందిరంపై బీజేపీ నేత

  • సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తుంది
  • రాకుంటే బీజేపీ పార్లమెంటు సభ్యులు బిల్లును తెస్తారు
  • అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారన్న తపన్ భౌమిక్

అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు వెల్లడిస్తుందన్న ఆశాభావాన్ని ఆ పార్టీకి చెందిన తపన్ భౌమిక్ వ్యక్తం చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోతే... బీజేపీ నేతలు రామ మందిరం నిర్మిస్తామనే హామీ ఇస్తారని ఆయన  చెప్పారు. ‘‘తీర్పు హిందువులకు అనుకూలంగానే వస్తుంది. లేకపోతే దీనిపై మేం హామీ ఇస్తాం. కోట్లాది మంది హిందువులు దాన్ని సుసాధ్యం చేస్తారు’’ అని భౌమిక్ పేర్కొన్నారు. తమ పార్టీ లోక్ సభ సభ్యులు అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామమందిర నిర్మాణం హామీని నెరవేరుస్తారని చెప్పుకొచ్చారు.

‘‘తీర్పు తర్వాత లోక్ సభలో ఉన్న బీజేపీ సభ్యులు నిబంధనలను రూపొందిస్తారు. అయోధ్యలోని అదే స్థలంలో ఆలయ నిర్మాణానికి అనుకూలంగా బిల్లును తీసుకొస్తారు’’ అని చెప్పారు. అయోధ్య వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి విచారణ వచ్చే ఫిబ్రవరి 8న జరగనుంది.

  • Loading...

More Telugu News