robber: చోరీల కోసం నగరంలో అడుగుపెట్టిన నిక్కర్ బ్యాచ్... పోలీసుల్లో కలవరం!

  • మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో సంచారం
  • సీసీటీవీ కెమెరాల ఫుటేజీలతో వెలుగులోకి
  • 4-10 మంది ముఠాగా సంచారం

రాజధానిలోకి నిక్కర్ బ్యాచ్ అడుగుపెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుల్లో సైతం కలవరం మొదలైంది. నిక్కర్, బనియన్ ధరించిన యవకులు రాత్రి వేళ సంచరిస్తూ భారీ చోరీలకు పాల్పడే ముఠాగా పోలీసులు గుర్తించారు. వంటినిండా నూనె రాసుకుని పట్టుకుంటే క్షణాల్లో తప్పించుకుని పారిపోయేలా సన్నద్ధం, దొంగతానికి అడ్డొస్తే చంపడానికైనా వెనుకాడని బ్యాచ్ గా భావిస్తున్నారు. వీరు తమ వెంట కత్తులు, ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో సంచరిస్తుంటారని పేర్కొంటున్నారు. ఏమీ లేకపోతే చివరికి రాళ్లదాడికి సైతం వీరు వెనుకాడరు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత లోపల ఎవరైనా ఉన్నట్టు గర్తిస్తే వెంటనే వారిని భయపెట్టి తాళ్లతో కట్టేయడం వీరు చేసే పని. అడ్డగిస్తే తమ చేతిలో ఉన్న ఆయుధాలతో దాడి చేసేస్తారు. అవసరమైతే చంపడానికీ వెనుకాడరు.

సుమారుగా 4 నుంచి 10 మంది కలసి ఓ ముఠాగా సంచరిస్తుంటారు. పగటి పూట బెలూన్లు, ఇతర ఆట వస్తువులను విక్రయిస్తూ తాళం వేసి ఉన్న సంపన్నుల ఇళ్ల సమాచారాన్ని ముఠాలోని మహిళా సభ్యులు పసిగడతారు. రాత్రి చోరీలకు ఆ ఇళ్లనే ఎంచుకుంటారు. తాజాగా మియాపూర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈ ముఠా సంచరిస్తోంది. ఈ ప్రాంతంలో పలు చోరీలు జరగ్గా, దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు పలు అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే విషయం వెలుగు చూసింది. దీంతో వీరిని పట్టుకునేందుకు నగరంలోని అన్ని కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News