railway: రైల్వేను నిరుడు 11 లక్షల మంది దొంగలు లూటీ చేశారు..!

  • బోల్టులు, ఫ్యాన్లు, లైట్లు.. ప్రతీ వస్తువు చోరీయే
  • 2.23 లక్షల మంది మహారాష్ట్రలో అరెస్ట్
  • 2016లో దొంగల చేతి వాటం

ఈ సంఖ్య వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. దొంగలకు రైల్వే కల్పతరువుగా మారినట్టుంది!. ఏ పది మందో, వంద మందో కాదు... ఏకంగా 11 లక్షల మంది 2016లో రైల్వేలో తమకు తోచిన చోరీలు చేస్తూ దొరికిపోయారు. పంపులు, బోల్టులు, టవళ్లు, వాష్ బేసిన్లు, కాపర్ వైర్లు, ఫిష్ ప్లేట్స్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్, ట్యూబులైట్లు, ఫ్యాన్లు, ఏసీ కోచుల్లో దుప్పట్లు ఇలా చేతికి దొరికినదాన్ని ఎత్తుకుపోయారు.

వాస్తవానికి ఇలా చోరీలు చేస్తూ రైల్వే రక్షక దళానికి దొరికిన వారి సంఖ్య 11 లక్షలే కానీ, దొరకకుండా పనికానిచ్చేసిన వారి సంఖ్య ఎంతుంటుందో అంచనాకు కష్టమే. రైల్వే రక్షక దళం పట్టుకున్న చోరుల్లో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. ఇక్కడ 2.23 లక్షల మంది పట్టుబడ్డారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో 1.22 లక్షల మంది అరెస్టయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 98,594 మంది, తమిళనాడులో 81,408 మంది, గుజరాత్ లో 77,047 మంది పట్టుబడ్డారు.

  • Loading...

More Telugu News