andrea jeremiah: 'విశ్వ‌రూపం 2'లో పాట పాడిన న‌టి ఆండ్రియా!

  • గాయ‌నిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి
  • విశ్వరూపంలో నటనతో పాటు పాట 
  • 'భ‌ర‌త్ అనే నేను'లో కూడా ఓ పాట 

క‌మ‌లహాస‌న్‌ 'విశ్వ‌రూపం 2' సినిమా షూటింగ్ ఇటీవ‌ల పునః ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న న‌టి ఆండ్రియా ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో బొమ్మ‌రిల్లు, రాఖీ, దేశ‌ముదురు, కింగ్‌, క‌రెంట్‌, సై ఆట‌, ద‌డ‌, ఎందుకంటే ప్రేమంట, రెబ‌ల్‌, ఎవ‌డు వంటి చిత్రాల్లో పాట‌లు పాడి ఆండ్రియా మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మ‌హేశ్ బాబు న‌టిస్తున్న 'భ‌ర‌త్ అనే నేను' చిత్రంలో కూడా ఆండ్రియా ఓ పాట పాడుతున్న‌ట్లు సమాచారం. 'విశ్వ‌రూపం' మొద‌టి చిత్రంలో కూడా ఆండ్రియా కీల‌క పాత్ర పోషించింది.

andrea jeremiah
vishwaroopam 2
Kamal Haasan
  • Loading...

More Telugu News