Chandrababu: ప‌వ‌న్ కల్యాణ్ ఆలోచ‌న అదే!: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

  • పోల‌వ‌రం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తికావాలన్న‌దే ప‌వ‌న్ ఆలోచ‌న‌
  • వైసీపీ ఆలోచ‌న మాత్రం అది కాదు
  • నాపై బుర‌ద చ‌ల్లాల‌ని చూస్తున్నారు
  • కేంద్ర ప్ర‌భుత్వం సాయ‌ప‌డ‌తామ‌ని చెప్పింది

'సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ర‌కంగా ఆలోచిస్తున్నారు.. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తికావాలన్న‌దే ఆయ‌న ఆలోచన‌. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాకాదు.. ఆ పార్టీ నేత‌లు దీనిపై ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు.. అడ్డుకోవాల‌ని చూస్తున్నారు' అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఇప్పుడు అఖిల ప‌క్షాన్ని తీసుకుని ఢిల్లీకి పోవాల్సిన అవ‌స‌రం లేదని చెప్పారు. మూడురోజుల దక్షిణకొరియా పర్యటన ముగించుకుని నిన్న‌ రాత్రి చంద్ర‌బాబు విజయవాడ చేరుకున్నారు.

ఈ రోజు విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. "వైసీపీ ఉద్దేశం ఏంటీ? ఏదో ఒక విధంగా ప్రాజెక్టుకు అడ్డంకులు తేవాలి. నేను కూడా చేయ‌లేక‌పోయాన‌న్న బుర‌ద చ‌ల్లాలి. పోల‌వ‌రం ఏపీ జీవ‌నాడి, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీప‌డ‌ను. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సాయ‌ప‌డ‌తామ‌ని చెప్పింది. వైసీపీ నేత‌లకు ఇప్ప‌టికైనా స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఉందా? పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు వెళుతోన్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లి అభ్యంత‌రాలు తెలిపింది.

ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎందుకు ఇచ్చార‌ని ఢిల్లీలో కాంగ్రెస్ నేత‌లు అడుగుతున్నారు. ఆనాడు కాంగ్రెస్‌, వైసీపీ నాట‌కాలు ఆడ‌క‌పోతే పోల‌వ‌రం ప్రాజెక్టుకి అడ్డంకులు వ‌చ్చేవి కావు. గ‌తంలో ప‌ట్టిసీమ‌ను కూడా అడ్డుకోవాల‌ని చూశారు. ప్రాజెక్టులు ఆపాల‌ని కోర్టులో కేసులు వేశారు" అని అన్నారు.

  • Loading...

More Telugu News