facebook: పనిచేయడానికి ఉత్తమ ప్రదేశాల్లో ఫేస్‌బుక్ టాప్... సర్వేలో వెల్లడి
- 84వ స్థానానికి పడిపోయిన ఆపిల్
- రెండో స్థానంలో బైన్ అండ్ కంపెనీ
- అమెరికాలో వంద కంపెనీల జాబితా వెల్లడించిన గ్లాస్‌డోర్ వెబ్‌సైట్
ప్రముఖ జాబ్ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్, అమెరికాలో ఉద్యోగులకు ఓ సర్వే నిర్వహించి పనిచేయడానికి ఉత్తమ కంపెనీల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఉన్న వంద కంపెనీల్లో ఫేస్‌బుక్ మొదటి స్థానంలో నిలిచింది. ఆపిల్ సంస్థ 84వ స్థానంలో ఉంది. గతేడాది ఇదే జాబితాలో ఆపిల్ 36వ స్థానం సంపాదించుకుంది. ఎక్కువ రేటింగ్ ఉన్న యాజమాన్య సంస్థగా ఆపిల్ ముందంజలో ఉన్నప్పటికీ పనిచేయడానికి ఉత్తమ ప్రదేశంగా మాత్రం ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయింది.
ఇక రెండో స్థానంలో బైన్ అండ్ కంపెనీ ఉండగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఇన్ ఎన్ ఔట్ బర్గర్, గూగుల్ సంస్థలు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయంగా ఎంతోమందిని ప్రభావితం చేసే ఫేస్‌బుక్ సంస్థ ఉద్యోగులు చాలా చక్కని పని వాతావరణంలో పనిచేస్తున్నారని గ్లాస్‌డోర్ సీఈఓ రాబర్ట్ హోమన్ తెలిపారు. అలాగే ఆపిల్ గురించి చాలా మంది ఉద్యోగులు అసంతృప్త సమీక్షలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.