tamil tv anchor: నాన్నను ఒప్పించలేక రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నానంటున్న తమిళ టీవీ యాంకర్

  • వివాహం చేసుకున్నానన్న యాంకర్ మణిమేగలై
  • మతాంతర వివాహానికి అంగీకరించని తండ్రి
  • తన నిర్ణయాన్ని తండ్రి అర్ధం చేసుకుంటారన్న యాంకర్ 

తన తండ్రిని ఒప్పించలేక రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నానని సన్ నెట్ వర్క్ టీవీ యాంకర్ మణిమేగలై తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన మణిమేగలై, తన తండ్రిని ఒప్పించడంలో విఫలమయ్యానని పేర్కొంది. పరిస్థితులన్నీ చేజారిపోవడంతోనే హుస్సేన్ ని రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. అయినా ఏదో ఒకరోజు తన నిర్ణయం సరైనదని తెలుసుకుంటారని భావిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ప్రేమకు మతం లేదని, తాను హుస్సేన్ ని ప్రేమిస్తున్నానని పేర్కొంది. దీంతో ఆమె వివాహానికి మతం అడ్డుగా మారిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. వివాహం సందర్భంగా ఆమెకు స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మణిమేగలై, హుస్సేన్ దంపతుల ఫోటో చూడండి. 

tamil tv anchor
mani megalai
love marriage
  • Error fetching data: Network response was not ok

More Telugu News