ranveer singh: 'టెంపర్' రీమేక్ ఫస్ట్ లుక్ ఇదే... క్రేజీగా రణ్ వీర్ సింగ్!

  • టెంపర్ ను రీమేక్ చేస్తున్న రోహిత్ శెట్టి
  • సినిమా పేరు సింబా
  • రణ్ వీర్ సింగ్ పాత్ర పేరు సంగ్రామ్ సింగ్

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘టెంపర్‌’ తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జొహార్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. దీనికి ‘సింబా’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆ పాత్ర పేరు 'సంగ్రామ్ సింగ్'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

బాలీవుడ్ లో ఎనర్జీకి మారుపేరైన నటుడిగా పేరుతెచ్చుకున్న రణ్ వీర్ సింగ్, ఈ సినిమా ఫస్ట్ లుక్ లో క్రేజీగా కనిపిస్తున్నాడు. పాతతరం సినిమా పోస్టర్ ను తలపించేలా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ బాలీవుడ్ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌, ఆర్‌ఎస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2018 ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి అదే ఏడాది డిసెంబర్‌ 28న సినిమా విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. 

ranveer singh
rohith shetty
karan johar
simmba
  • Error fetching data: Network response was not ok

More Telugu News