keerthi suresh: సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' .. విడుదల తేదీ ఖరారు

  • 'మహానటి' నుంచి టైటిల్ లోగో 
  • త్వరలోనే రానున్న ఫస్టులుక్
  • సావిత్రి అభిమానుల్లో ఆసక్తి      

మంచి మనిషి .. మహానటి అనే సావిత్రి గురించి చిత్రపరిశ్రమలో చెప్పుకుంటారు. ఆమెకి కల్లాకపటం తెలియదని సన్నిహితులు అంటారు. దానధర్మాలు చేయడంలో ఆమె తరువాతనే ఎవరైనా అని చెబుతారు. అలాంటి సావిత్రి .. వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆ బాధను మరిచిపోవడానికి మద్యానికి బానిసై అనారోగ్యాన్ని కొనితెచ్చుకుని తనువు చాలించింది.

ఆమె జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ లోగోను వదిలారు. త్వరలోనే ఫస్టులుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీగా మార్చి 29వ తేదీని ఖరారు చేసుకున్నారు. సమంత .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. దుల్కర్ సల్మాన్ .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.         

keerthi suresh
samantha
shalini pandey
  • Loading...

More Telugu News