ola cab: కారు డోర్లు లాక్ చేసి.. మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు!

  • రాత్రి 10:30 నిమిషాలకు డ్యూటీ ముగించుకున్న మహిళ
  • ఇందిరా నగర్ నుంచి బీటీఎం లే అవుట్ వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుకింగ్
  • రూట్ మళ్లించి ఛైల్డ్ లాక్ వేసి లైంగిక వేధింపులకు దిగిన డ్రైవర్

బెంగళూరులో ఓలా క్యాబ్ లో ఓ మహిళ లైంగిక వేధింపులను ఎదుర్కొంది. దీనిపై ఓలా క్యాబ్స్ క్షమాపణలు చెప్పింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న ఓ యువతి రాత్రి 10.30 గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇందిరానగర్ నుంచి బీటీఎమ్ లేఅవుట్ లోని ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుంది. దీంతో ఆమెను తీసుకెళ్లేందుకు రాజశేఖర్ రెడ్డి అనే డ్రైవర్ ను ఓలా పంపింది.

ఇదే అదనుగా భావించిన డ్రైవర్ రాజశేఖర్ రెడ్డి, డోర్లు తెరుచుకోకుండా ఛైల్డ్ లాక్ వేసి కారును రింగ్ రోడ్డు మీదుగా పోనిచ్చి, నిర్మానుష్య ప్రాంతంలో ఆపి, ఆమె శరీరాన్ని అసభ్యకరంగా తడమడం ఆరంభించాడు. దీంతో బాధితురాలు అద్దాలపై కొడుతూ గట్టిగా కేకలు వేస్తుండడంతో ఆందోళన చెందిన రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు దిగుతుండగా, కారు దిగి 500 మీటర్ల దూరంలోని ఇజిపుర ట్రాఫిక్ సిగ్నల్ వరకు పరుగెత్తి వేధింపుల నుంచి ఆమె బయటపడింది.

అనంతరం ఆమె బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం నిందితుడు పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి, తీవ్రపరిణామాలు ఎదుర్కొంటావని బెదిరింపులకు దిగడం విశేషం. దీనిపై ఒలాక్యాబ్స్ విచారం వ్యక్తం చేసింది. అతనిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్లు పెట్టింది.

ola cab
harassment
  • Error fetching data: Network response was not ok

More Telugu News