Cards Game: పేకాట గృహం నిర్వహిస్తూ పట్టుబడ్డ తెలుగు చిత్ర నిర్మాత కేవీ రమణారెడ్డి ... అరెస్ట్!

  • టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
  • పేకాట క్లబ్ నిర్వహిస్తున్న కేవీ రమణారెడ్డి అరెస్ట్
  • మరో ఏడుగురు కూడా
  • రూ. లక్షన్నరకు పైగా నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో తెలుగు చిత్ర నిర్మాత కేవీ రమణారెడ్డి సహా ఎనిమిది మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ రాధాకిషన్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం, రమణారెడ్డి పంజాగుట్టలోని కోటేశ్వరరావు బిల్డింగ్‌ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దానిని గేమింగ్ హౌస్ గా మార్చారు. అక్కడికి ధనవంతులను ఆహ్వానించి పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు.

ఈ విషయంపై ఉప్పందుకున్న పోలీసులు, టాస్క్‌ ఫోర్స్‌ కు సమాచారాన్ని చేరవేయగా, వారు దాడి చేశారు. పోలీసులు వెళ్లే సమయానికి నిందితులంతా పేకాట ఆడుతూ ఉండటంతో వారిని అరెస్ట్ చేశారు. అక్కడ జరుగుతున్న జూదానికి రమణారెడ్డే నిర్వాహకుడని గుర్తించినట్టు పేర్కొన్నారు. వారి నుంచి రూ. లక్షన్నరకు పైగా నగదు, 8 సెల్‌ ఫోన్‌ లు స్వాధీనం చేసుకున్నామని, అందరినీ కోర్టు ముందు హాజరు పరచనున్నామని తెలిపారు.

Cards Game
Pekata
Punjagutta
Tollywood
Producer
Arrest
  • Loading...

More Telugu News