Sumant: వైఎస్ జగన్, నేనూ క్లాస్ మేట్స్.. చాలా అల్లరి చేసే వాళ్లం!: హీరో సుమంత్

  • ఇద్దరమూ క్లాస్ మేట్స్
  • తాళాలు లేక గోడదూకిన మిత్రులు
  • చూసేసిన అక్కినేని నాగేశ్వరరావు
  • ఫన్నీ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్న సుమంత్

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్, తాను ఒకే క్లాసులో చదువుకున్నామని చెబుతూ, తమ జీవితంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను హీరో సుమంత్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తామిద్దరమూ కలిసి తిరిగేవాళ్లమని, చాలా అల్లరి చేస్తుండే వాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఒకరోజు డిన్నర్ కోసం ఇద్దరమూ బయటకు వెళ్లామని, ఆపై రాత్రి 12 గంటల తరువాత ఇంటికి వచ్చిన వేళ, తాను గోడ ఎక్కి దూకేందుకు జగన్ సహకరించారని, జగన్ మాత్రం తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు పట్టుబడి పోయారని చెప్పాడు.

అప్పటివరకూ జగన్ ఎవరన్న విషయం తాతయ్యకు తెలియదని, తాను బాల్కనీ పట్టుకుని వేలాడుతూ, "తాతా... జగన్... రాజశేఖరరెడ్డి కుమారుడు" అని చెప్పగా, సీరియస్ గా చూసి, "నైస్ టూ మీట్ యూ" అని వెళ్లిపోయారని అన్నాడు. అదొక నైస్ ఇన్సిడెంట్ అని, తాళాలు మరచిపోయినందునే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను మీరూ చూడండి.

Sumant
Jagan
Akkineni Nageswara Rao
  • Error fetching data: Network response was not ok

More Telugu News