unesco: యునెస్కో వారసత్వ సంపదలో తాజ్ మహల్ కి ద్వితీయ స్థానం... సర్వేలో వెల్లడి
- సంవత్సరానికి 80 లక్షల మంది పర్యాటకులు
- మొదటి స్థానంలో ఆంగ్ కోర్ వాట్ దేవాలయం
- సర్వే నిర్వహించిన ట్రిప్ అడ్వైజర్
యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన పర్యాటక ప్రదేశాల్లో ఆగ్రాలోని తాజ్ మహల్ రెండో ఉత్తమ పర్యాటక ప్రదేశంగా నిలిచింది. ఏటా 80 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తున్నారని ఆన్‌లైన్ సర్వే నిర్వహించిన ప్రముఖ టూరిజం వెబ్‌సైట్ ట్రిప్ అడ్వైజర్ ప్రకటించింది. కాగా మొదటి స్థానంలో కాంబోడియాలోని హిందూ దేవాలయం ఆంగ్ కోర్ వాట్ నిలిచింది.
ఇంకా ఈ జాబితాలో మూడో స్థానంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, నాలుగో స్థానంలో పెరూలోని మచ్చు పిచ్చు ప్రదేశాలు నిలిచాయి. అలాగే బ్రెజిల్‌లోని ఇగౌజు జాతీయ పార్కు, ఇటలీలోని సాసీ ఆఫ్ మటేరా, పోలండ్‌లోని క్రాకో, ఆష్విట్జ్ బిర్కెనో మ్యూజియం, ఇజ్రాయిల్‌లోని జెరూసలెం పాత పట్టణం, టర్కీలోని కొన్ని ప్రాంతాలకు ఎక్కువ మంది పర్యాటకులు ఓటు వేశారు.