Jagan: కొమ్మినేని ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పిన వైఎస్ జగన్!

  • పాదయాత్రతో ప్రజలతో మమేకమవుతున్న జగన్
  • నెల రోజులు పూర్తి చేసుకున్న ప్రజాసంకల్ప యాత్ర
  • జగన్ ను ఇంటర్వ్యూ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు 
  • నేటి రాత్రి 7 గంటలకు 'సాక్షి' చానల్ లో ప్రసారం

ప్రస్తుతం పాదయాత్ర చేస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, తన సొంత మీడియా 'సాక్షి' చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూ చేస్తూ, "బాబొస్తే... మీరు ఏమన్నారు?" అంటూ జగన్ తో తనదైన శైలిలో మాట్లాడించే ప్రయత్నం చేశారు.

పాదయాత్రలో జగన్ కు ఎదురైన అనుభవాలేమిటి? టీడీపీ కామెంట్స్ పై ఆయన స్పందన... కొనసాగుతున్న నేతల వలసలపై ప్రశ్నలు సంధించారు. 45 ఏళ్లకే పెన్షన్ అన్న జగన్ కీలక హామీ ఎలా అమలవుతుందన్న దానిపైనా, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏదో చేస్తున్నారన్న విమర్శలపైనా జగన్ నుంచి సమాధానాలు చెప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఆశాభంగం కలిగించలేదా? అని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జగన్ ఈ ఇంటర్వ్యూ ఇవ్వగా, ఇది నేటి రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.

Jagan
Sakshi
Kommineni Srinivas
Interview
  • Loading...

More Telugu News