million dollar baby: 'మిలియ‌న్ డాల‌ర్ బేబీ' రీమేక్‌లో అక్ష‌య్ కుమార్‌?

  • బాలీవుడ్‌కి మ‌రో బాక్సింగ్ మూవీ
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఏఆర్ మురుగ‌దాస్‌
  • బాక్సింగ్ కోచ్ పాత్రలో అక్ష‌య్‌

బాలీవుడ్‌లో త్వ‌ర‌లో మ‌రో బాక్సింగ్ క‌థాంశ ఆధారిత సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. నాలుగు ఆస్కార్లు అందుకున్న హాలీవుడ్ చిత్రం 'మిలియ‌న్ డాల‌ర్ బేబీ' చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్నారు. దీని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను ఏఆర్ మురుగ‌దాస్ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ప్ర‌ధాన పాత్రలో టీవీ న‌టి మెరీనా కువార్‌ను చిత్ర‌బృందం ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే 'ప‌ద్మ‌న్‌', 'కేస‌రి', 'గోల్డ్' చిత్రాల‌తో బిజీగా ఉన్న అక్ష‌య్‌, ఈ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.  2004లో విడుద‌లైన 'మిలియ‌న్ డాల‌ర్ బేబీ' చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇందులో బాక్సింగ్ క్రీడాకారిణిగా హిల్ల‌రీ స్వాంక్‌, ఆమె కోచ్‌గా ప్రఖ్యాత నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ న‌టించారు.

million dollar baby
akshay kumar
marina kuwar
hillary swank
clint eastwood
  • Loading...

More Telugu News