MLC Rajendra Prasad: 'అమ్మా రోజా... కాస్త అతి తగ్గించుకో': టీడీపీ నేత వార్నింగ్

  • రోజా ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి
  • టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు వద్దు
  • టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

గాలేరు - నగరి ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, చేసిన తన పాదయాత్ర ముగింపు వేళ, తిరుమలలో జరిగిన హై డ్రామాపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, రోజా అతి యాక్షన్ తగ్గించుకోవాలని అన్నారు. అధికారులపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.

 తిరుమలకు వచ్చి కావాల్సినన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టిన ఆయన, ఈఓ సింఘాల్ నేతృత్వంలో టీటీడీ సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. రోజా తన విమర్శలు వెనక్కు తీసుకోవాలని, ఎస్వీబీసీ చానల్ లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్న విషయాన్ని ఆమె మరిచిపోయారని విమర్శించారు.

MLC Rajendra Prasad
Roja
TTD
  • Loading...

More Telugu News