maganti babu: ఎంపీగారి స్పెషల్: దోశలు వేసి, ఇడ్లీలు, ఛాయ్ అమ్మిన టీడీపీ ఎంపీ మాగంటి బాబు!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటకు వెళ్లిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు
  • రోడ్డు పక్కన హోటల్ లో సరదాగా దోశలు వేసిన బాబు
  • దోశలు, ఇడ్లీలు, టీ విక్రయించిన బాబు

ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు చేసే పనులు ఆసక్తి రేపుతుంటాయి. జాతరల్లో డ్యాన్సులు చేయడం, కోడిపందాలు నిర్వహించడం, అభిమానులతో కలిసిపోవడం.. ఇలా తనదైన శైలిలో ఆయన ఆసక్తి రేపుతుంటారు. తాజాగా ఆయన ఒక హోటల్ లో దోశలు, ఇడ్లీలు వేసి అమ్మారు. ఆ పక్కనే ఉన్న మరో టీ కొట్టులోకి వెళ్లి, అక్కడ కూడా సందడి చేసి, ఛాయ్ కలిపి విక్రయించి ఆసక్తి రేపారు.

ఈ ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది. ఎంపీగారు ఇడ్లీ, దోశ, ఛాయ్ అమ్ముతున్నారని తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని, ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, తాను తరచూ ఇటు వస్తుంటానని అన్నారు.  

maganti babu
aswaraopet
Telugudesam mp
eluru mp
  • Loading...

More Telugu News