Cricket: టీమిండియాను ఊరిస్తున్న రికార్డు.. చరిత్ర నెలకొల్పేందుకు ఏడు వికెట్ల దూరంలో భారత్!

  • వరుసగా 9 టెస్టు సిరీస్ లు నెగ్గిన జట్టుగా నిలిచేందుకు టీమిండియా ఆరాటం 
  • మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు
  • శ్రీలంక ముంగిట భారీ లక్ష్యం 

మరో రికార్డు సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ ల రికార్డు విజయానికి భారత్‌ ఇక ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ను శ్రీలంక 373 పరుగుల వద్ద ముగించగా, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన భారత్ 246 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో భారత జట్టు శ్రీలంకకు 410 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక ఆదిలోనే ఓపెనర్లు కరుణ రత్నె (13), సమరవిక్రమ (5), లక్మల్ (0) ల వికెట్లు కోల్పోయింది. క్రీజులో డిసిల్వా (13), మాథ్యూస్ ఆడుతున్నారు. నేడు చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ టెస్టులో శ్రీలంక విజయం సాధిస్తే సిరీస్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అయితే పిచ్, వాతావరణం నేపథ్యంలో అలా జరిగే అవకాశాలు కనపడడం లేదు.

మరోవైపు టీమిండియా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే మూడు వికెట్లు కూల్చింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ను శ్రీలంక అడ్డుకోవడం కష్టం. మ్యాచ్ లో శ్రీలంక ఓటమిపాలైనా, లేదా డ్రాగా ముగిసినా సిరీస్ విజయం భారత్ దే. దీంతో వరుసగా 9 టెస్టు సిరీస్ లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా సరసన టీమిండియా నిలిచి చరిత్ర నెలకొల్పనుంది. 

  • Loading...

More Telugu News