pithani: బీసీల‌కు ఉన్న రిజ‌ర్వేష‌న్ శాతంలో మార్పులు చేయ‌లేదు: మ‌ంత్రి పితాని

  • కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల బీసీల‌కు న‌ష్టం జ‌ర‌గ‌దు
  • బీసీల‌కు  చంద్ర‌బాబు  అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌రు
  • షెడ్యూల్‌-9లో కాపుల‌కు అద‌నంగా 5 శాతం రిజ‌ర్వేష‌న్‌
  • వాల్మీకి, బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చడాన్ని స్వాగ‌తిస్తున్నాం

కాపుల‌కు రిజ‌ర్వేషన్‌లు క‌ల్పిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాస‌న‌స‌భ‌ ఆమోదించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ ఈ విష‌యంపై స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బీసీల‌కు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌రని అన్నారు.

బీసీల‌కు ప్ర‌స్తుతం ఉన్న రిజ‌ర్వేష‌న్ శాతంలో మార్పులు చేయ‌లేదని, వారికి న‌ష్టం క‌లుగ‌బోద‌ని తెలిపారు. షెడ్యూల్‌-9లో కాపుల‌కు అద‌నంగా 5 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన‌ట్లు చెప్పారు. వాల్మీకి, బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చడాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. బీసీల‌కు టీడీపీ అనేక ప‌దవుల‌ను క‌ల్పించింద‌ని అన్నారు.   

  • Loading...

More Telugu News