pavan kalyan: అమెరికాలో అత్యధిక థియేటర్స్ లో 'అజ్ఞాతవాసి'?

  • ముగింపు దశకి చేరుకున్న 'అజ్ఞాతవాసి'
  • అమెరికాలోను పెరుగుతోన్న క్రేజ్ 
  • వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో అక్కడ రిలీజ్ 
  • జనవరి 10న భారీ స్థాయి విడుదల

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' రూపొందుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అక్కడ ఈ సినిమాను 209 ప్రాంతాల్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అమెరికాలో 'బాహుబలి 2'ని 126 ప్రాంతాల్లో .. 'ఖైదీ నెంబర్ 150' మూవీని 74 ప్రాంతాల్లో .. 'కబాలి'ని 73 ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. వీటన్నిటికీ మించి 'అజ్ఞాతవాసి'ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ పవన్ కి గల క్రేజ్ .. త్రివిక్రమ్ సినిమాలకి గల మార్కెట్ కారణంగా ఈ స్థాయిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

pavan kalyan
keerti suresh
anu emmanuel
  • Loading...

More Telugu News