Mahesh Babu: సమ్మర్ పోటీ నుంచి తప్పుకున్న మహేష్ బాబు!

  • మూడు సినిమాల విడుదల తేదీ ఏప్రిల్ 27గా ప్రకటన
  • థియేటర్ల కొరత, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం
  • వెనక్కు తగ్గిన కొరటాల శివ టీమ్
  • ఏప్రిల్ 13నే రానున్న 'భరత్ అనే నేను'

ఏప్రిల్ 27... గత వారం రోజులుగా తెలుగు సినీ ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని కలిగిస్తున్న రోజు. రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ '2.0', మహేష్ బాబు 'భరత్ అనే నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' విడుదలకు పోటీ పడుతున్నాయని వార్తలు వచ్చిన రోజు. ఇక మూడు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదలైతే, కలెక్షన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న సత్యాన్ని గమనించిన కొరటాల శివ టీమ్, పోటీ నుంచి తప్పుకుందని, 'భరత్ అనే నేను' చిత్రాన్ని కనీసం రెండు వారాల ముందుగానే విడుదల చేయాలన్న సంకల్పంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ఏప్రిల్ 27న కాకుండా, అంతకు రెండు వారాల ముందుగానే, అంటే 13వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మహేష్, అల్లు అర్జున్ చిత్రాల నిర్మాతలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నారని కూడా తెలుస్తోంది.

Mahesh Babu
Allu Arjun
Bharat Anu nenu
Na peru Surya
2.0
Rajanikant
  • Loading...

More Telugu News