India: 373 పరుగులకు లంక ఆలౌట్!

  • నాలుగో రోజు 23 నిమిషాల్లోనే ఆఖరి వికెట్ అవుట్
  • 164 పరుగుల వద్ద ధావన్ కు క్యాచ్ ఇచ్చిన చండీమల్
  • భారత లీడ్ 163 పరుగులు
  • మరికాసేపట్లో భారత్ రెండో ఇన్నింగ్స్

న్యూఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఉదయం నాలుగో రోజు ఆట ప్రారంభమైన తరువాత 23 నిమిషాల్లోనే లంక కథ ముగిసింది. లంక ఆటగాడు చండీమల్ అద్భుత రీతిలో రాణించి 164 పరుగులు చేశాడు.

నిన్న 9 వికెట్లు కోల్పోయిన లంక ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన తరువాత, 136వ ఓవర్ లో ఇషాంత్ శర్మ వేసిన మూడో బంతిని చండీమల్ షాట్ కొట్టగా, లాంగ్ ఆన్ లో ఉన్న శిఖర్ ధావన్ క్యాచ్ పట్టడంతో లాంఛనం ముగిసింది. ప్రస్తుతం భారత జట్టు 163 పరుగుల లీడ్ లో ఉంది. మరికాసేపట్లో భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. సాధ్యమైనంత త్వరగా స్కోర్ బోర్డుపై 300కు పైగా పరుగులను జోడించి, రేపు ఆఖరి రోజున లంక వికెట్లన్నీ తీయడం ప్రస్తుతం భారత్ ముందున్న లక్ష్యం.

India
Sri Lanka
Cricket
New Delhi
  • Loading...

More Telugu News