black day: 'బ్లాక్ డే' నేపథ్యంలో.. హైదరాబాదులో 144 సెక్షన్ అమలు!

  • హైదరాబాదులో 144 సెక్షన్
  • డిసెంబర్ 5 ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు 
  • డిసెంబర్ 6 బ్లాక్ డే ను పురస్కరించుకుని 144 సెక్షన్

హైదరాబాదులో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. డిసెంబర్‌ 6న బ్లాక్‌ డే ను పురస్కరించుకుని నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 48 గంటలపాటు 144 సెక్షన్ విధించామని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న 48 గంటలపాటు హైదరాబాదులో ర్యాలీలు, ప్రదర్శనలు, పబ్లిక్‌ మీటింగ్‌ లు, సమావేశాలను రద్దు చేస్తున్నామని చెప్పారు.

144 సెక్ష‌న్ అమ‌లులో ఉన్న ప్రాంతాల్లో న‌లుగురు లేదా అంత‌కుమించి ఒకేచోట గుమికూడి ఉండ‌టం, స‌భ‌లు, స‌మావేశాల్లో ఉద్రేక‌పూరితంగా, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగాలు చేయ‌డం నిషేధ‌మ‌ని ఆయన స్పష్టం చేశారు. ఏవైనా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించాలనుకుంటే ముంద‌స్తు అనుమతులు త‌ప్ప‌నిస‌రి అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. 

black day
december 6th
Hyderabad
144 section
  • Loading...

More Telugu News