tammareddy bhardwaja: ఏపీకి సినీ పరిశ్రమ అవసరం లేదు.. హైదరాబాదులో మేం హ్యాపీ!: తమ్మారెడ్డి భరద్వాజ

  • ప్రభుత్వానికి మా అవసరం లేదు
  • అవసరం వస్తే మాట్లాడుదాం
  • హైదరాబాదులో బాగానే ఉన్నాం

ఏపీకి సినీ పరిశ్రమ అవసరం లేదని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ ఫెస్ట్ లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వానికి తమ అవసరం లేదని అన్నారు. ఒకవేళ అవసరం పడితే అప్పుడు దానిపై మాట్లాడుదామని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్టణాన్ని ఫిలిం హబ్‌ గా అభివృద్ధి చేయాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమను విశాఖకు తీసుకురావాలన్న ఆలోచన, కోరిక ప్రభుత్వానికి లేవని ఆయన అన్నారు. ఆ కోరిక లేనప్పుడు తామెందుకు రావాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తామంతా హైదరాబాదులో బాగానే ఉన్నామని ఆయన తెలిపారు. ఏపీలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏదో చేస్తుందని భావించామని, అయితే ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆయన విమర్శించారు. 

tammareddy bhardwaja
controversy comments
film city in vizag
  • Loading...

More Telugu News