l.ramana: ద‌గాకోరు ప‌రిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే శ‌క్తి మీకు ఉంది: విద్యార్థుల‌తో ఎల్‌.ర‌మ‌ణ

  • 'కొలువుల‌కై కొట్లాట' స‌భకు అనూహ్య స్పంద‌న
  • రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌త్తుని నిర్ణ‌యించేది విద్యార్థులే
  • ఈ రాష్ట్రంలో ఎంతో దోపిడీ జ‌రుగుతోంది
  • కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకోవడం లేదు 

హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో టీజేఏసీ నిర్వ‌హిస్తోన్న‌ 'కొలువుల‌కై కొట్లాట' స‌భకు అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఈ స‌భ‌కు హాజ‌రైన టీటీడీపీ నేత ఎల్‌.ర‌మ‌ణ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ద‌గాకోరు ప‌రిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే శ‌క్తి విద్యార్థుల‌కు ఉందని అన్నారు. రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌త్తుని నిర్ణ‌యించేది విద్యార్థులేన‌ని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎంతో దోపిడీ జ‌రుగుతోందని చెప్పారు.

తెలంగాణ‌లో స‌హ‌జ సంప‌ద‌, భూగ‌ర్భ సంప‌దను దోచుకునేవారు, ల్యాండ్‌ మాఫియా, లిక్క‌ర్ మాఫియాలు పేట్రేగిపోతున్నార‌ని ఎల్‌.ర‌మ‌ణ అన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు లేక బాధ ప‌డుతున్నార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం ఏ చ‌ర్య‌లూ తీసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా అడ్డంకులు సృష్టించినా టీజేఏసీ ఈ స‌భను నిర్వ‌హిస్తోంద‌ని కొనియాడారు. 

  • Loading...

More Telugu News