jamuna: సావిత్రి గుర్తుపట్టి కారు పంపించింది .. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన అదే: జమున
- సావిత్రి సినిమాల్లోకి రావడానికి ముందే నాకు పరిచయం
- నేను సినిమాల్లోకి వచ్చాక ఆమె నన్ను గుర్తుపట్టింది
- అక్కాచెల్లెళ్ల మాదిరిగా ఉండేవాళ్లం
- ఆ తరహా పాత్రలే ఎక్కువగా చేశాం
సావిత్రితో తనకి గల అనుబంధాన్ని గురించి జమున ప్రస్తావిస్తూ .. తమ పరిచయం ఎలా జరిగిందనే విషయాన్ని గురించి వివరించారు. "సావిత్రి 12 .. 13 యేళ్ల వయసులో డాన్స్ చేయడానికి దుగ్గిరాల వచ్చింది. నాకు డాన్స్ అంటే ఇష్టం కనుక తన వెనక తిరగడమే కాదు .. మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టాను. ఆ తరువాత తాను సినిమాల్లోకి వెళ్లింది .. కొన్నాళ్లకు నేను సినిమాల్లోకి వెళ్లాను"
" 'పుట్టిల్లు' సినిమాకి సంబంధించి నా ఫోటో ఓ పత్రికలో పడింది. ఆ ఫోటోను చూసిన సావిత్రి .. " ఈ అమ్మాయి దుగ్గిరాలలో చూసిన అమ్మాయిలా వుందే" అనుకుని .. అవునో .. కాదో తెలుసుకోవడం కోసం పెద్ద కారులో ఒక వ్యక్తిని పంపించింది. నేనే దుగ్గిరాల జమునని ఆ వ్యక్తికి చెప్పడంతో, తాను నన్ను ఇంటికి పిలిపించి ఆప్యాయంగా పలకరించింది. అప్పటి నుంచి నేను ఆమెను అక్కా అని పిలిస్తే .. తను నన్ను చెల్లి అని పిలిచేది. ఇక సినిమాల్లోను మేం అక్కా చెల్లెళ్ల పాత్రలు ఎక్కువగా వేయడం విశేషం" అని చెప్పుకొచ్చారు.