Cricket: సెంచరీలతో రాణించిన మాథ్యూస్, చండిమాల్!

  • మూడో రోజు ఆటలో ఆకట్టుకున్న శ్రీలంక జట్టు
  • రెండు సెంచరీలతో ఆకట్టుకున్న లంకేయులు
  • మాథ్యూస్, చండిమాల్ శతకాలు 

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియాకు దీటుగా శ్రీలంక ఆటగాళ్లు ఆడుతున్నారు. లంక కెప్టెన్ దినేష్ చండిమాల్ (116) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకు ముందు ఆ జట్టు సీనియర్ ప్లేయర్ మాథ్యూస్ (111) సెంచరీతో మార్గదర్శిగా నిలిచాడు. అంతకుముందు వీరిద్దరికీ పెరీరా స్పూర్తిగా నిలిచాడు.

ఓపెనర్ కరుణరత్నె(0), డిసిల్వా (1) వేగంగా పెవిలియన్ చేరిన దశలో నమ్మకం కోల్పోకుండా టీమిండియా బౌలర్లను ఎదుర్కొని అర్ధసెంచరీ దిశగా పెరీరా దూసుకుపోయాడు. అయితే జడేజా వేసిన అద్భుత బంతికి పెరీరా (46) ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అప్పటి నుంచి ఆచి తూచి ఆడిన వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

మొదటి, రెండో టెస్టులో కోల్పోయిన విశ్వాసాన్ని వీరిద్దరూ జట్టు బ్యాట్స్ మన్ లో నింపే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరూ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం మాధ్యూస్ (111) ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో కెప్టెన్ చండిమాల్ కు సమర విక్రమ (33) జత కలిశాడు. అయితే, ఇషాంత్ బౌలింగ్ లో సమర విక్రమ ఆడిన బాల్ బ్యాట్ ను ముద్దాడుతూ వెళ్లడంతో, దానిని సాహా అద్భుతంగా క్యాచ్ పట్టేసి అవుట్ చేశాడు. ఆ తరువాత వచ్చిన సిల్వాను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో శ్రీలంక జట్టు ఆరు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. చండిమాంల్ కు డిక్ వెలా జత కలిశాడు. 

  • Loading...

More Telugu News