jamuna: ఒక డైలాగ్ చెప్పడానికి 20 టేకులు తీసుకున్నాను: జమున
- నేను .. ఏఎన్నార్ చేసిన మొదటి సినిమా 'నిరుపేదలు'
- టెక్నికల్ విషయాలను ఎలా దృష్టిలో పెట్టుకోవాలనేది ఏఎన్నార్ చెప్పారు
- వాయిస్ కల్చర్ ఎలా ఉండాలనేది ఆయన చూపించారు
నటించేటప్పుడు ఏయే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి .. వాయిస్ కల్చర్ ఎలా ఉండాలనే విషయాలను తనకి నాగేశ్వరరావు చెప్పారంటూ, ఆనాటి సంగతులను తెలుగు పాప్యులర్ టీవీతో జమున పంచుకున్నారు. " నేను .. నాగేశ్వరరావు కలిసి నటించిన మొదటి సినిమా 'నిరుపేదలు'. ఈ సినిమా సమయంలోనే సాంకేతిక పరమైన విషయాలను ఎలా దృష్టిలో పెట్టుకుని నటించాలనేది నాగేశ్వరరావు చెప్పారు" అని అన్నారు.
"ఈ సినిమా సమయంలోనే ఆయన నాకు వాయిస్ కల్చర్ గురించి వివరించారు. ఈ సినిమాలో నేను 'నారాయణా నువ్వు దొంగతనం చేశావా?' అనే డైలాగ్ చెప్పాలి. వాయిస్ కల్చర్ లేకపోవడం వలన, నేను ఆ డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోతున్నాను. దాంతో 20 టేకులు తీసుకోవలసి వచ్చింది. అప్పుడు అలా కాదంటూ నాగేశ్వరరావు చూపించారు. 20 టేకులు తీసుకోవడం నాకు బాధ కలిగించి, ఇంటికి వచ్చాక అద్దం ముందు అదేపనిగా ప్రాక్టీస్ చేశాక ఆ టెక్నిక్ పట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.