Sri Lanka: ముగ్గురు ఆట‌గాళ్లు వాంతులు చేసుకున్నారు: శ‌్రీలంక క్రికెట్‌ జ‌ట్టు కోచ్

  • మూడో టెస్టు మ్యాచులో శ్రీలంక క్రికెట‌ర్ల‌కు అస్వ‌స్థ‌త‌
  • మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు
  • హైడ్రామా క్రియేట్‌ చేశారనే వాదనలో నిజం లేదు
  • ఆటగాళ్ల భద్రతపై స్పష్టత కోరుతున్నాం

ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జ‌రుగుతోన్న‌ మూడో టెస్టు మ్యాచులో శ్రీలంక ఆట‌గాళ్లు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై మాట్లాడిన శ్రీలంక‌ కోచ్‌ నిక్‌ పోఠాస్.. త‌మ‌ క్రికెటర్లు హైడ్రామా క్రియేట్‌ చేశారనే వాదనలో నిజం లేద‌ని అన్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా ఉన్నాయని చెప్పారు. శ్రీలంక ఆట‌గాళ్లు సురంగ లక్మల్‌, లాహిరు గమగె, ధనంజయ డిసిల్వా డ్రెస్సింగ్ రూమ్‌కి వ‌చ్చి వాంతులు చేసుకున్నారని తెలిపారు.

మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు త‌మ‌ ఆటగాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. క్రికెటర్లు అలా ఇబ్బంది పడుతూ ఆడ‌టం మంచిదికాదని తెలిపారు. తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రికెట్‌ ఆడాలనే అనుకుంటామ‌ని చెప్పారు. కాక‌పోతే తాము ఆటగాళ్ల భద్రతపై స్పష్టత కోరుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఫీల్డింగ్‌ చేసేందుకు 10 మంది సైతం మైదానంలో లేని స్థితిని శ్రీలంక‌ కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్ త‌మ‌కు చెప్పాడ‌ని అన్నారు. అప్పుడు తాము ఏం చేస్తున్నామో అంపైర్లకు తెలుసని అన్నారు. కాలుష్యంపై క్రికెట్‌లో నిబంధనలూ ఎక్కువగా లేవని ఆయన తెలిపారు. ఢిల్లీలో వాతావ‌ర‌ణ కాలుష్యం అధికంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News