lock screen ads: లాక్ స్క్రీన్ ప్రకటనలిచ్చే యాప్‌లను నిషేధించిన గూగుల్ ప్లే స్టోర్
- డెవలపర్ పాలసీలో మార్పులు చేసిన గూగుల్
- అవసరం ఉంటే మినహా అలాంటి ప్రకటనలు వేయొద్దని ఉవాచ
- నిషేధించిన వాటిలో చైనా యాప్‌లే ఎక్కువ
స్మార్ట్‌ఫోన్లలో స్క్రీన్ లాక్ చేసి ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే కొన్ని ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇలాంటి ప్రకటనలు బ్యాటరీని ఎక్కువ వినియోగించుకోవడమే కాకుండా, అత్యవసర సమయాల్లో చిరాకు కలిగిస్తుంటాయి. అయితే ఇక నుంచి ఇలాంటి లాక్ స్క్రీన్ ప్రకటనలు ఇచ్చే యాప్‌లపై గూగుల్ ప్లే స్టోర్ నిషేధం విధించింది.
ఈ మేరకు డెవలపర్ పాలసీలో గూగుల్ మార్పులు చేసింది. అత్యవసరం ఉంటే మినహా లాక్‌స్క్రీన్ ప్రకటనలు వేయొద్దని అందులో పేర్కొంది. డబ్బుల కోసం లాక్ స్క్రీన్ ప్రకటనలు వేస్తున్న ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, హాట్‌స్పాట్ షీల్డ్ వీపీఎన్ వంటి ప్రముఖ యాప్‌లను గూగుల్ నిషేధించింది. ఈ కోవలోనే చైనాకు చెందిన చాలా యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.