Sailaja: బతిమాలుకున్నా వినలేదు... అందుకే అలా చేశాను: తొలిరాత్రి శైలజను హింసించిన రాజేష్

  • సంసారానికి పనికిరాని రాజేష్
  • విషయం బహిర్గతం చేయవద్దని శైలజను బతిమిలాడా
  • అయినా చెప్పేయడంతో ఆగ్రహంతో అలా చేశా
  • పోలీసుల విచారణలో కొత్త విషయాలు చెప్పిన రాజేష్

తనలోని లోపం గురించిన రహస్యాన్ని బయటకు చెప్పవద్దని భార్యను ఎంతగానో బతిమాలుకున్నా వినకపోవడంతోనే ఆగ్రహంతో అంత క్రూరంగా ప్రవర్తించానని తొలిరాత్రి శైలజను తీవ్రంగా హింసించిన రాజేష్ పోలీసుల ముందు అంగీకరించాడు. విచారణలో భాగంగా, కొన్ని కొత్త విషయాలను రాజేష్ తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గదిలోకి వెళ్లిన తరువాత, తానే స్వయంగా తన విషయాన్ని చెప్పానని, ఇలా సంసారానికి పనికిరానివారు ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారని గుర్తు చేస్తూ, పెళ్లి తనతో అయినా, కోరికలు తీర్చుకునేందుకు మరెవరినైనా చూసుకోమని ఆఫర్ కూడా ఇచ్చానని చెప్పాడు.

తన విషయం ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డానని, గుట్టుగా జీవితాన్ని నెట్టుకురావాలని భావించగా, తన భార్య ఆ విషయం బయటకు చెప్పడంతోనే క్రూరంగా మారిపోయానని చెప్పుకొచ్చాడు. తానెంతో మనో వేదనను అనుభవించానని, విషయం బయటకు రాకుండా ఉంటే శైలజను బాగా చూసుకునేవాడినని రాజేష్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన శైలజ ప్రస్తుతం కోలుకుంటోంది.

Sailaja
Rajesh
First Night
  • Loading...

More Telugu News