Jayalalitha: ఒకే పళ్లెంలో తిన్నాం... ఒకే మంచంపై పడుకున్నాం: భావోద్వేగంతో అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అమృత

  • చాలా సార్లు అమ్మను కలిశాను
  • ఎక్కడైనా ప్రాణాలతో ఉంటే చాలని చెప్పేవారు
  • ఎంతో ఆప్యాయత చూపే అమ్మ జయలలిత
  • ఓ ఇంటర్వ్యూలో అమృత

1996 తరువాత చాలా సార్లు తన తల్లి జయలలితను కలిశానని, ఆమెకు కూతురిగా చెప్పుకుంటూ తెరపైకి వచ్చిన అమృత వ్యాఖ్యానించారు. తనను చూసినప్పుడల్లా అమ్మ ఎంతో ఆప్యాయతను చూపేదని అన్నారు. తామిద్దరమూ ఒకే పళ్లెంలో తినేవాళ్లమని, ఒకే మంచంపై పడుకున్నామని భావోద్వేగాల మధ్య గుర్తు చేసుకున్నారు. అమ్మను కలిసేందుకు సెక్రటేరియేట్ కు వెళ్లిన ప్రతిసారీ, తనను ఎక్కడైనా క్షేమంగా ఉండాలని ఆశీర్వదించేవారని, "నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు" అని అంటుండేవారని అన్నారు.

చివరిసారిగా అమ్మ ఆసుపత్రిలో చేరడానికి ముందు తాను ఫోన్ చేసి చూసేందుకు వస్తున్నానని చెబితే రావద్దని వారించారని తెలిపారు. తాను ఇంట్లో ఉండబోవడం లేదని చెప్పారని, అప్పటికీ తాను వేదనిలయంకు వెళ్లి విచారిస్తే, అప్పటికి ఇంట్లోనే వైద్య చికిత్సలు చేయిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. తాను జయలలితను పలుమార్లు కలిసిన సీసీ టీవీ ఫుటేజీలు ఉంటాయని, జెడ్ కేటగిరీ రిజిస్టర్ ను పరిశీలించినా ఈ విషయం బహిర్గతమవుతుందని అన్నారు. అమ్మను కలవకుండా శశికళ తనను ఎన్నో మార్లు అడ్డుకుందని అమృత ఆరోపించారు.

  • Loading...

More Telugu News