కమిషన్లు తీసుకోవడం.. అదంతా ఓ బ్రహ్మపదార్థం... వేలు పెట్టని వాడే ఉండడు!: ఉండవల్లి అరుణ్ కుమార్
- ప్రాజెక్టుల్లో కమిషన్లు సర్వసాధారణమే
- అందనివారు విమర్శలు చేస్తుంటారు
- పోలవరం ఆలస్యం వెనుక టీడీపీ, బీజేపీ
- కేసులకు భయపడుతున్న చంద్రబాబు
ఈ ప్రాజెక్టుపై సంకీర్ణంలో భాగంగా ఏర్పడ్డ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ప్రాజెక్టు ఆలస్యం వెనుక టీడీపీ, బీజేపీల తప్పుందని ఆరోపించారు. పోలవరం విషయంలో చంద్రబాబునాయుడు ఎన్నో సెల్ఫ్ గోల్స్ వేసుకున్నాడని, అతనికి తెలియకుండానే ఇలా చేసుంటాడని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. ఓటుకు నోటు వంటి కేసులతో భయపడే చంద్రబాబు రాజీకి వచ్చుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ విషయం మరుగున పడ్డ తరువాత, ఇప్పుడు చేసిన అప్పులకు లెక్కలు చెప్పలేక భయపడుతున్నారని ఆరోపించారు. అప్పుగా తెచ్చిన రూ. 1.20 లక్షల కోట్లకు, ఫైనాన్స్ కమిషన్ కు లెక్కలు చెప్పలేక ఆయన అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.