Vijay Marchant Under 16: క్రికెట్ ఊహకు కూడా అందని గెలుపు... ఇన్నింగ్స్ 870 పరుగుల తేడాతో బీహార్ విజయం!

  • నమ్మశక్యం కాని విజయాన్ని సొంతం చేసుకున్న బీహార్
  • బాధిత జట్టు అరుణాచల్ ప్రదేశ్
  • వేదిక విజయ్ మర్చంట్ అండర్-16 ట్రోఫీ

గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకూ ఇంత పెద్ద విజయాన్ని ఎవరూ ఊహించి కూడా ఉండరేమో. ఓ జట్టు ఇన్నింగ్స్ 870 పరుగుల తేడాతో మరో జట్టును ఓడిస్తుందంటే నమ్మేస్తామా? అదే జరిగింది. ఇంత సంచలనానికి వేదిక విజయ్‌ మర్చంట్‌ (అండర్‌-16) ట్రోఫీ. తలపడిన జట్లు బిహార్‌, అరుణాచల్ ప్రదేశ్!

తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఆరుణాచల్‌ ప్రదేశ్, 83 పరుగులకే కుప్పకూలగా, బ్యాటింగ్ లో విధ్వంసం చూపిన బీహార్ ఏకంగా 1007 పరుగులు చేసింది. బిన్నీ ట్రిపుల్‌ సెంచరీ (358), ప్రకాశ్‌ డబుల్‌ సెంచరీ (220) చేశారు. ఆపై రెండో ఇన్నింగ్స్ కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ 54 పరుగులకే  కుప్పకూలింది. దీంతో బీహార్ జట్టు, ఇన్నింగ్స్ 870 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరుణాచల్ రెండు ఇన్నింగ్స్ లో ఆరుగురు ఆటగాళ్ల చొప్పున డక్కౌట్ కావడం గమనార్హం.

Vijay Marchant Under 16
Cricket
Bihar
Arunachal Pradesh
  • Loading...

More Telugu News