ivanka trump: ఇవాంకా ట్రంప్ గురించి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారి నోరు జారాడట!

  • జీఈఎస్ సదస్సుకు హాజరైన ఇవాంకా ట్రంప్
  • ఇవాంకా పర్యటనపై మీడియా కవరేజ్
  • మీడియా కథనాల్లో అవాస్తవాలు

హైదరాబాదులో భారత్ ఘనంగా నిర్వహించిన జీఈఎస్-2017 కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు ఇవాంకా ప్రత్యేక విమానంలో వస్తారని, శాటిలైట్ ద్వారా వైట్ హౌస్ నుంచే ఆమె రక్షణ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని, భారీ బలగంతో, సొంత కాన్వాయ్ తో ఆమె హైదరాబాదులో అడుగుపెడతారని వార్తలు ప్రసారమైన సంగతి తెలిసిందే.

అయితే ఆమె మీడియా ప్రచారం చేసినట్టు కాకుండా సాధారణ ప్రయాణికురాలిలా విమానంలో వచ్చారు. అలాగే సొంత కాన్వాయ్ లేదు.. అమెరికా రాయబార కార్యాలయం ఆమెకు మూడు వాహనాలు సమకూర్చింది. ఇదంతా చూసి ఇక్కడి మీడియా, అధికారులు చేస్తున్న హడావుడి నేపథ్యంలో ఆమెతో పాటు వచ్చిన అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు నవ్వుకున్నారని ఒక వార్తా సంస్థ పేర్కొంది.

అమెరికాలో ఇవాంకకు అంత గొప్ప పేరు లేదని, ఆమెను అక్కడ ఆమె తండ్రిలాగే ఫేక్ అని పేర్కొంటారని ఆ సీక్రెట్ ఏజెంట్ పేర్కొన్నాడట. ఇవాంకాకు చెందిన కంపెనీ ఉత్పత్తులను మేసిస్‌ అనే సంస్థతో పాటు ఆరేడు సంస్థలు నిషేధించాయని కూడా చెప్పాడట. ఆ ఉత్పత్తులకు తమ సంస్థల్లో విక్రయించే అర్హత లేదని ఆ కంపెనీలు నిషేధించాయట. అలాంటి ఇవాంకకు భారత్ లో ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని ఆయన ఆశ్చర్యపోయాడట. ఇక అమెరికా భద్రతాధికారుల తీరుపై మన అధికారులు పెదవి విరిచారని కూడా తెలుస్తోంది. వారు నిబంధనలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారని, క్లిష్టపరిస్థితుల్లో మన పోలీసులే వారికంటే మెరుగ్గా పని చేస్తారని మన అధికారులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News