somu veerraju: పోలవరంలో నిన్నటివరకు పని చేసిన కాంట్రాక్టర్ ఇప్పుడెందుకు పనికిరాకుండాపోయాడు?: సోము వీర్రాజు

  • కాంట్రాక్టర్ ను ఎందుకు మార్చాలనుకుంటున్నారు?
  • పాత కాంట్రాక్టర్ కే పెంచిన డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు
  • ఈ ప్రొక్యూర్ మెంట్ వెబ్ సైట్ లో టెండర్లు ఎందుకు పెట్టలేదు

పోలవరం ప్రాజెక్టు పనులు నిన్నటి వరకు చేసిన కాంట్రాక్టరు అకస్మాత్తుగా ఎందుకు మారాలి? అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, 2014లోనే కాంట్రాక్టు అప్పగించిన కంపెనీ ఎందుకు పనులు చేయలేకపోతోందని ఆయన అన్నారు. ఎల్ అండ్ టీ, త్రివేణి తదితర కంపెనీలన్నీ పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములెలా అయ్యాయని ఆయన ప్రశ్నించారు.

ఇంత మంది పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కాంట్రాక్టరును ఎందుకు మార్చాల్సి వస్తోందని ఆయన చెప్పారు. 2014లో కాంట్రాక్టుకు తీసుకున్న వ్యక్తి 14 శాతం తక్కువ ధరకు పని పూర్తి చేస్తానన్నాడని, అతను చేయలేకపోతున్నాడని చెప్పి, ప్రాజెక్టు అంచనాలు పెంచి టెండర్లకు పిలుస్తున్నారు. 'అలాంటప్పుడు పాత కాంట్రాక్టర్ కే ఆ ధర ఇచ్చి పనులు పూర్తి చేయించండి' అని సోము వీర్రాజు తెలిపారు. అలా కాకుండా ఏకపక్షంగా కాంట్రాక్టర్ ను తీసేస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే ఈ- ప్రొక్యూర్ మెంట్ టెండర్లు పిలిచినప్పుడు టెండర్లను పారదర్శకంగా వెబ్ సైట్ లో ఎందుకు పేర్కొనలేదని ఆయన నిలదీశారు. 

  • Loading...

More Telugu News