narayana: న్యాయపరమైన చిక్కులు రాకుండా కాపు రిజర్వేషన్లు ప్రకటించాం: నారాయణ

  • పార్లమెంటులో కాపు రిజర్వేషన్ చట్టమైపోతుంది
  • బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేదు
  • ఆర్.కృష్ణయ్యకు ఉన్న సమస్య ఏంటో అర్ధం కావడం లేదు

1998లో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కాపులకు రిజర్వేషన్ కల్పించామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల గురించి చెబుతూ కమిషన్ వేసి, పూర్తి గణాంకాల వివరాలతో నివేదిక ఇచ్చిన సిఫారసుల ప్రకారం అసెంబ్లీ ఆమోదం పొందితే.. దానిని పార్లమెంటుకు పంపి, చట్టం చేయవచ్చని సుప్రీం చెప్పిందని తెలిపారు. ఈ ప్రకారమే తాము కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అయిపోయిందని ఆయన తెలిపారు.

ఇప్పుడు దానిని పార్లమెంటుకు పంపుతామని, దీనిని చట్టం చేసేందుకు కేంద్రానికి సమయం కావాలి కనుక.. కేంద్రానికి కనీసం 8 నెలల సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. అంతవరకు జీవో ఇచ్చైనా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. బీసీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించడంపై ఆర్.కృష్ణయ్యకు ఉన్న సమస్య ఏంటో తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. ఈ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు. మెజారిటీ కాపులు సీఎంను కలిసి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదని తెలిపారని ఆయన వెల్లడించారు. దీంతో ఈ రిజర్వేషన్లను రాజకీయాలకు వర్తింపజేయలేదని మంత్రి తెలిపారు. 

  • Loading...

More Telugu News