Cricket: రెండో రోజు ఆట ముగిసింది... శ్రీలంక 131/3
- వెలుతురు మందగించడంతో ముగిసిన రెండో రోజు ఆట
- 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన కోహ్లీ
- 136 పరుగు వద్ద రెండో రోజు ఆటను ముగించిన శ్రీలంక
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో రెండోరోజు ఆట ముగిసింది. తొలుత భారత్ 7 వికెట్ల నష్టానికి 536 చేసి డిక్లేర్ చేసింది. శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డింగ్ కు ఇబ్బంది పడడంతో కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, శ్రీలంక ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రారంభించారు.
తొలి బంతికే షమి ఓపెనర్ కరుణరత్నెను పెవలియన్ కు పంపాడు. అనంతరం పెరీరాకు జతకలిసిన డిసిల్వా (1) కూడా తొందరగానే అవుటయ్యాడు. అనంతరం పెరీరా (42) అర్ధసెంచరీకి చేరువవుతున్న దశలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో మథ్యూస్ (57) కు చండిమాల్ (25) జతకలిశాడు. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వెలుతురు సరిగ్గా లేకపోవడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆటముగిసే సమయానికి శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.