Virat Kohli: నాటకీయ పరిణామాల మధ్య ఆగ్రహంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కోహ్లీ!

  • వాయు కాలుష్యంతో ఇబ్బంది పడి మైదానం వీడిన గమగే, లక్మల్
  • మూడు సార్లు మ్యాచ్ కు అంతరాయం
  • కోపంతో డిక్లేర్ చేసిన కోహ్లీ

శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌ లో ఆసక్తికర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాయుకాలుష్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బౌలింగ్ కు రనప్ చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడం సమస్యగా మారిందని ఆరోపిస్తూ శ్రీలంక బౌలర్లు గమగే, లక్మల్ ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. రెండు సార్లు ఇదే కారణంతో వారు మైదానం వీడడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది.

ఇంతలో ఫిరోజ్ షా కోట్ల మైదానాన్ని పొగలు కమ్మేశాయి. దీంతో బీసీసీఐ వారికి మాస్కులు అందజేసింది. వాటి సాయంతో కొంత సేపు ఆడిన తరువాత వాటితో ఫీల్డింగ్ చేయడం ఇబ్బందిగా ఉందని మరోసారి అంపైర్లకు శ్రీలంక ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఈ సమయంలో... కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు మూడు సార్లు అంతరాయం కలిగించడంతో కోహ్లీ అసహనానికి గురయ్యాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లకి ఫీల్డింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటే, తామే ఫీల్డింగ్ చేస్తామని సైగలు చేస్తూ, డిక్లేర్ చేస్తున్నట్టు తెలిపాడు. దీంతో లంకేయులు బ్యాటింగ్ ప్రారంభించారు. 

Virat Kohli
team india
srilanka
pollution
  • Error fetching data: Network response was not ok

More Telugu News