Pakistan: 2018 పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఉగ్రవాది హఫీజ్ సయీద్

  • జనవరి 21న అరెస్టు అయిన హఫీజ్ సయీద్
  • కోర్టు ఉత్తర్వులతో నవంబర్ 24న గృహనిర్బంధం నుంచి విడుదల
  • కశ్మీర్ కోసం పోరాడుతానని ప్రకటన

26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్-ఎ-తొయిబా, జమాత్-ఉద్-దవా ఉగ్రవాద సంస్థల చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. భారత్, అమెరికాల ఒత్తిడితో గత జనవరి 21న అరెస్టై పది నెలల పాటు గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్, కోర్టు తీర్పుతో నవంబర్‌ 24న విడుదలైన సంగతి తెలిసిందే.

అనంతరం మాట్లాడుతూ, కశ్మీర్ విముక్తి కోసం తన పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించాడు. తాజాగా, వచ్చే ఏడాది జరిగే పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నానని ప్రకటించాడు. మిలి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు తెలిపాడు. ఆగస్టులో ప్రారంభమైన ఈ పార్టీ అధ్యక్షుడిగా సైపుల్లా ఖలీద్ ను నియమించాడు.  

Pakistan
hafeej saeed
terrorist
  • Loading...

More Telugu News