Hyper Aadi: కొట్టి, హేళన చేస్తే హాస్యమా?: జబర్దస్త్ షోపై ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం!

  • ఇతర వర్గాలను కించపరిస్తే హాస్యమా?
  • న్యాయ నిర్ణేతలకు నవ్వు ఎలా వస్తోంది?
  • హైపర్ ఆది క్షమాపణ చెప్పాల్సిందే
  • దివ్యాంగుల హక్కుల సమితి డిమాండ్

భార్యలను కొట్టడం, అసభ్యంగా మాట్లాడటం, ఇతర వర్గాల వారిని కించపరచడం హాస్యం ఎలా అవుతుందని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాంబాబు ప్రశ్నించారు. ఈ ఉదయం ఫర్ ఆర్ఫాన్ రైట్స్, కమ్యూనిటీ ఎంపవర్ మెంట్, మా ఇల్లు ఆశ్రమం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగగా, రాంబాబు పాల్గొని, హైపర్ ఆది క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' షోలో అనాథ పిల్లలను, కించపరిచారని, మహిళలను అగౌరవ పరుస్తున్నారని విమర్శించారు. ఇతరులను అవమానిస్తూ, అదే హాస్యం అని చూపించడం తగదని, ఇతర యాంకర్లు, న్యాయ నిర్ణేతలకు ఈ షోను చూస్తే ఎందుకు నవ్వు వస్తున్నదో తెలియడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు, రియాల్టీ షోల పేరిట ఏ వర్గాన్నీ కించపరిస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

Hyper Aadi
Jabardast
ETv
  • Loading...

More Telugu News